తెలంగాణ

ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిన తెలంగాణ.. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..

తెలంగాణ ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిపోయిందంటూ రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, EHS, ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించి, వాటిని ఖర్చు చేయడం లేదని విమర్శించారు. తనపై రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 370 కేసులు ఉన్నాయని, ఎన్నో త్యాగాలు చేశానని గుర్తుచేస్తూ.. తన గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.