తెలంగాణ
అవినీతికి అడ్డాగా గురుకులాలు.. అధికారుల తీరుపై ప్రిన్సిపాళ్ల ఆవేదన!!..
రాష్ట్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రతిష్ట కొందరు అవినీతి అధికారుల కారణంగా మసకబారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జోనల్, రీజినల్ ఆఫీసులు వసూళ్లకు అడ్డాగా మారాయనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కార్యాలయాల్లో ప్రతీ పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. కొందరు అధికారులు తమ సామాజికవర్గానికి చెందిన వారిని కిందిస్థాయిలో నియమించుకొని దందా కొనసాగిస్తున్నారు. వారు చెప్పినంత ఇస్తే ఓకే.. లేకపోతే వేధింపులకు దిగుతున్నారు. ఫలితంగా గురుకులాల ప్రిన్సిపాళ్లు నరకం చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
