తెలంగాణ
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..
తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి స్పష్టం చేశారు. ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రమాద, సహజ మరణాలకు ఇందిరమ్మ బీమా పాలసీ తెస్తామన్నారు. అలాగే పర్యావరణహిత ఆటోల కోసం రూ.200 కోట్లతో 18,766 ఆటోలకు ఒక్కోదానికి లక్షన్నర ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు.
