తెలంగాణ

Graduates MLC Elections: కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్ చిచ్చు.. బీఆర్ఎస్‌తో టచ్‌లోకి అసమ్మతి నేత.. కారెక్కుతారా?

Graduates MLC Elections:తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీల్లో అసమ్మతి మంటలను రాజేస్తున్నాయి. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని ప్రకటించడంతో గాంధీ భవన్‌లో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది. ఈ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. "త్యాగం ఒకరిది.. భోగం మరొకరిదా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు గులాబీ బాస్‌లతో రాయబారాలు మొదలుపెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.తనకు దక్కని సీటు మరెవరికీ దక్కకూడదన్న వ్యూహంతో హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థిని దెబ్బకొట్టేందుకు కారెక్కడానికి సైతం సిద్ధపడినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడే ఆయనకు గులాబీ నేతలు షాక్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్ పార్టీ రెండు పట్టభద్రుల స్థానాలనూ (వరంగల్-నల్గొండ-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్) ఒకే సామాజిక వర్గానికి కేటాయించింది.