తెలంగాణ
Telangana Govt: తెలంగాణలో మరో కొత్త పథకం.. మహిళలకు పూర్తిగా ఉచితం.. లక్షకు పైనే
Telangana Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని స్కీమ్స్ తీసుకొచ్చింది. పథకాల ద్వారా ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. తాజాగా బీసీ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం రేవంత్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 కుట్టు మిషన్లను అందించనున్నారు. రేపు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. లబ్దిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో పథకం అమలు చేయనుంది సర్కార్.
