తెలంగాణ

ఆటో కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Indiramma Illu: పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, అల్పాదాయ వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. వారి సొంతింటి కల నెరవేర్చడంతో పాటు స్థిరమైన నివాసం కల్పిస్తోంది. ఇంటి అద్దెల భారం తప్పడంతో ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తోంది.

220 కోట్లతో 4 ప్రాంతాల్లో ఆటోనగర్ కాలనీల నిర్మాణం

తాజాగా హైదరాబాద్ నగరంలోని ఆటో కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆటో కార్మికుల సొంతింటి కల సాకారం కానుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటో కార్మికులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల టవర్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. బండ్లగూడ, గంధంగూడ, పేట్ బషీర్‌బాగ్, జల్ పల్లి లక్ష్మీగూడలో హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆటోనగర్ కాలనీలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.220 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.