తెలంగాణ

ఒక్కొక్కరికి రూ.1,53,912.. సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..

Singareni: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాభాల వాటా ప్రకటించింది. గత ఏడాదిలానే ఈసారి కూడా పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34శాతం వాటా ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.1,53,912 బోనస్ అందనుంది. అటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా గతంలో మాదిరి ఈసారి కూడా 5,500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది సింగరేణికి రూ.1,754 కోట్ల లాభాలు వచ్చాయి. సింగరేణిలో పర్మినెంట్ కార్మికుల సంఖ్య 38వేలు కాగా కాంట్రాక్ట్ వర్కర్ల సంఖ్య 30వేలు.