తెలంగాణ

Governor Quota MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో రసవత్తర ఫైట్! కాంగ్రెస్ పెద్దల ఫైనల్ లిస్ట్ లీక్?

Governor Quota MLC: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగియనుండటంతో, వారి స్థానాల్లో రాజ్ భవన్‌కు పంపే పేర్లను ఖరారు చేసేందుకు అధిష్ఠానం కసరత్తు కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తుంది. ఉన్నవి 3 సీట్లు.. కానీ రేసులో డజన్ల కొద్దీ ఆశావహులు ఉండటంతో గాంధీ భవన్ నుంచి ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల దాకా ముమ్మర లాబీయింగ్ సాగుతుందనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. అయితే కేబినెట్ భేటీ వేదికగా గవర్నర్‌కు సిఫారసు చేయబోయే ముగ్గురి ఫైనల్ లిస్ట్ దాదాపు రెడీ అయ్యిందన్న లీక్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు తెరలేపింది.