తెలంగాణ
నేపాల్ వరదలు.. తెలంగాణ వాసుల భద్రతకు రేవంత్ సర్కార్ చర్యలు
Nepal Flash Floods: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు.
