తెలంగాణ
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!..
రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుకు ఫీజుల భారం అడ్డుకాకూడదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అడ్వాన్స్ గా విద్యార్థుల ఖాతాలో ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు జమ చేయబోతున్నామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఇప్పటికే రూ.250 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేశామని భవిష్యత్‌లో కళాశాలల్లో ప్రవేశాలు పొందాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న నెలలోపు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేస్తామన్నారు.
