తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త!..
రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మార్చి నెల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న దాదాపు 16,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా మొత్తం రూ.185 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు సకాలంలో రాకపోవడంతో బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. అయితే, లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే తమ సొంత నిధుల నుంచి సర్దుబాటు చేసి నిధులు విడుదల చేసింది.
