తెలంగాణ
TG: టూరిస్ట్ స్పాట్లు, ఎడ్యుకేషన్ ప్రతిబింబించాలి.. ‘గ్లోబల్ సమ్మిట్’పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
TG: టూరిస్ట్ స్పాట్లు, ఎడ్యుకేషన్ ప్రతిబింబించాలి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ ఆదేశాలుతెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టేలా ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఇక్కడి చారిత్రక, పర్యాటక సంపదను, విద్యారంగంలో సాధిస్తున్న విప్లవాత్మక మార్పులను అంతర్జాతీయ వేదికపై ఘనంగా ఆవిష్కరించాలని ఆదేశించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా అట్టహాసంగా జరగనున్న గ్లోబల్ సదస్సు ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
