తెలంగాణ
TG: రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్!
TG: జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఏకంగా రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూల్స్‌ను తుంగలో తొక్కి అడ్డదారిలో పనులు చేసిపెట్టేందుకు బేరసారాలు సాగించిన సదరు అధికారిణి చివరికి కటకటాలపాలైంది.మెహదీపట్నం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసీరామ్ సునీత అవినీతి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఓ బిల్డింగ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆమె రూ.8 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని సదరు బిల్డర్‌పై ఒత్తిడి తెచ్చింది. పైగా మున్ముందు కూడా ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటానంటూ హామీ ఇచ్చింది. దీంతో సదరు బాధితుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
