తెలంగాణ
కాంగ్రెస్‌లో కొత్త కలకలం.. రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపిన ఏఐసీవీసీ!!..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ, అంటే ఏఐసీవీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి బహిరంగంగా మద్దతు ఎందుకు ప్రకటించలేదో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు 72 గంటల గడువు ఇచ్చినట్లు ఏఐసీవీసీకి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏఐసీవీసీ పేర్కొంది.
