Food Safety Telangana: కుళ్లిన మాంసం, దరిద్రంగా కిచెన్లు.. జనాల ఆరోగ్యంతో హోటళ్ల చెలగాటం
Food Safety Telangana: వెన్న పూసినట్లు మాట్లాడే బేరర్లు, డిమ్ లైట్ల మధ్య అందమైన మ్యూజిక్, టేబుల్ నిండా కలర్‌ఫుల్ ప్లేట్లు.. ఇదీ బయటి ప్రపంచానికి కనిపించే స్టార్ హోటళ్ల దర్పం. కానీ మీరు వేలకు వేలు బిల్లు కట్టి లొట్టలేసుకుంటూ తింటున్న ఆ బిర్యానీలు, స్టార్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిస్తే మాత్రం పచ్చి మంచినీళ్లు కూడా గొంతు దిగవు. ఐటీ కారిడార్‌లోని బడా రెస్టారెంట్లు, పబ్‌లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తాజా తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. వంటగదుల్లో కనిపించిన దరిద్రం, ఆహార తయారీ విధానం చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే వాంతి చేసుకోనంత పనైంది.అందమైన బిల్డింగులు, ఏసీ గదులు చూసి మోసపోతే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ఈ దాడులు స్పష్టం చేశాయి. తిన్న ఆహారం విషమై ఆసుపత్రుల పాలవుతున్న కేసుల వెనుక అసలు రహస్యం ఈ స్టార్ హోటళ్ల కిచెన్లలో దాగిన దరిద్రమేనని తేలిపోయింది. కస్టమర్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని కుళ్లిన మాంసం, కల్తీ వంటకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యాలపై కేవలం మూసివేతలే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు డిమాండ్
