తెలంగాణ

ప్రభుత్వ బడుల్లో పాముల కలకలం!..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాముల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. పాఠశాలలు, గురుకులాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లోకి విషసర్పాలు చొరబడుతున్నాయి. ఇటీవల నారాయణపేటలో పాముకాటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందగా.. దేవరకద్ర గురుకుల విద్యార్థి విషకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వర్షాలతో బొరియల్లోకి నీరు చేరడం, కప్పలు, ఇతర జీవులు పెరగడం, పాముల సంచార కాలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పరిసరాల్లో నీరు నిలవకుండా, చెత్తాచెదారం, పొదలు తొలగించి.. పాఠశాలలు, ఇళ్లను సురక్షితంగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.