తెలంగాణ

రైతు సంక్షేమం, మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం!..

తెలంగాణ 17th ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అంతకుముందు నాంపల్లిలోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను స్మరిస్తూ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తరతరాల అణచివేత, భూస్వామ్య దోపిడీపై ధిక్కార స్వరం వినిపించిన సుదీర్ఘ చరిత్ర తెలంగాణదని, సమ్మక్క-సారలమ్మల కాలం నుంచి సాయుధ పోరాటం వరకు అన్యాయాన్ని ఎదిరించడమే ఈ గడ్డ నైజమని కొనియాడారు.