తెలంగాణ

Telangana: తెలంగాణలో మొదలైన ఎల్‌నినో కష్టాలు.. గత చరిత్రలో దాగిన భయంకరమైన నిజాలు!!

రాష్ట్రంలో వరుణుడి అలక.. సూర్యుడి ప్రతాపం.. వెరసి ఎల్‌నినో ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక, వేసిన పంటలు ఎండిపోతుంటే.. పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో లేదో తెలియని దుస్థితిలో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు వర్షాల కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు పెరుగుతున్న సాగు ఖర్చులు.. ఇవన్నీ కలిసి రైతు జీవితాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారుతుంటే.. అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతన్నలు దిగాలు పడుతున్నారు.