తెలంగాణ
Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాస్త్రవేత్తల కీలక సూచనలు!!
ఎల్‌నినో ప్రభావం తెలంగాణ వానాకాలం సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ఈ సీజన్‌లో ధాన్యం దిగుబడి, బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఎల్‌నినో పరిస్థితులు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. ధాన్యం, బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
