TG: ఆసుపత్రి అనుమతుల కోసం రూ. లక్ష లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన డీఎంహెచ్‌వో!
TG: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ స్వర్ణకుమారి కాసుల కక్కుర్తి పడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మూతపడిన ఆసుపత్రిని రీ ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం సంచలనంగా మారింది.ఎల్బీనగర్ పరిధిలో సరైన లైసెన్స్ లేదనే కారణంతో ఇటీవల ఓ ఫిజియోథెరపీ హాస్పట్ని వైద్య శాఖ అధికారులు క్లోజ్ చేశారు. ఆసుపత్రిని మళ్లీ రీ ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ జారీ చేయాలంటే రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తం ఇచ్చుకోలేని సదరు ఆసుపత్రి యజమాని చివరకు తొలి విడతగా రూ.లక్ష ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే అధికారుల వేధింపులను భరించలేకపోయిన బాధితుడు, లంచం అడిగిన వీడియో ఎవిడెన్స్‌తో నేరుగా ఏసీబీని ఆశ్రయించారు.
