తెలంగాణ
ధరణి-భూ భారతి ఒక్కటే!!..
బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై 22ఏ నిషేధిత జాబితా భూములకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగారు. ఆరోపణలకు జవాబివ్వకుండా చర్చను పక్కదోవ పట్టించేందుకు అసెంబ్లీలో శతవిధాలా యత్నించారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. నిషేధిత జాబితా మాటున ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాలకు, క్విడ్ ప్రోకో పద్దతిలో పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు.
