తెలంగాణ

TG: దసరాకు ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు

TG: దసరా పండుగ వేళ ఊరెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తెలంగాణ ఆర్టీసీ పక్కా ప్లాన్ రెడీ చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏకంగా 7,000 ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రద్దీ తీవ్రతకు అనుగుణంగా ఎక్కడికక్కడ సర్వీసులు అందుబాటులో ఉండేలా అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు.కరీంనగర్ జోన్ పరిధిలో 3,533 బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌కి 1,175, నిజామాబాద్‌కి 719, ఖమ్మంకి 678, వరంగల్‌కి 530, ఆదిలాబాద్‌కి 431 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ జోన్ పరిధిలో 2,155 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. నల్గొండ 815, మహబూబ్ నగర్ 645, రంగారెడ్డి 440, మెదక్ 255 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదనంగా మరో 1,312 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు వెల్లడించారు.