తెలంగాణ
TG: దసరా దావత్లో మందుబాబుల రికార్డు.. రూ.2,054 కోట్ల అమ్మకాలు!
TG: తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు.. ఊరూవాడా దావత్ల రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దసరా వేడుకలకు తోడు వరుస సెలవులు రావడంతో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలు కట్టి పోటీపడి కొనడంతో లిక్కర్ అమ్మకాలు సరికొత్త రికార్డులను తిరగరాశాయి. కేవలం 19 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడై ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది దసరా సీజన్‌తో పోలిస్తే అమ్మకాల విలువ ఏకంగా 37.02 శాతం పెరగడం విశేషం.
