తెలంగాణ
TG: ఇలా జరుగుతుందని ముందే తెలుసు.. ఖైరతాబాద్ రచ్చపై దానం సంచలన కామెంట్స్!
TG: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవి కోల్పోవడం, స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ గెజిట్ రిలీజ్ చేయడం, అటు విజయారెడ్డి కోర్టు పిటిషన్లతో ఉపఎన్నికల ఉత్కంఠ పతాక స్థాయికి చేరిన వేళ.. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన తాజా కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తనపై అనర్హత వేటు పడటంపై ఆయన స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చానన్న ఆరోపణల కారణంగా తనపై అనర్హత వేటు పడలేదని దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన అనంతరం, మారిన రాజకీయ సమీకరణాలతో మరో పార్టీ తరఫున బరిలోకి దిగడం వల్లే టెక్నికల్‌గా ఈ డిస్క్వాలిఫికేషన్ ఎదురైందని స్పష్టం చేశారు.
