తెలంగాణ
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం పరిధిలో హైదరాబాద్లో నిర్మించనున్న ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు తెలంగాణ హౌసింగ్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28 నుండి 31 వరకు.. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున పూర్తి పారదర్శకంగా డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి. గౌతం తెలిపారు. ఈ లాటరీ ప్రక్రియను ఎటువంటి అనుమానాలకు, అపోహాలకు తావులేకుండా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రజలు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలంటే.. అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in సందర్శించాలని తెలిపారు.. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా ఖాతాలైన tghd.official ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కూడా చూడవచ్చని పేర్కొన్నారు.
