తెలంగాణ
Congress Party: గాంధీభవన్‌లో ‘సైలెంట్’ వార్.. ఢిల్లీకి పీసీసీ ఫిర్యాదుల చిట్టా!
Congress Party: తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల అలకలు, అంతర్గత కుమ్ములాటలు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకోవాల్సిన ఇద్దరు ‘సూపర్ సీనియర్’ మంత్రులు.. ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోకుండా ‘లైట్’ తీసుకోవడం ఇప్పుడు గాంధీభవన్‌తో పాటు ఏఐసీసీ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. వారి వైఖరితో విసిగిపోయిన పీసీసీ నాయకత్వం.. చివరకు అధిష్టానానికే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
