తెలంగాణ

Telangana: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ..రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారు!..

రాష్ట్రంలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో వీరిద్దరినీ ఎంపిక చేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.