తెలంగాణ

రూల్స్ సీఎంకేనా పీసీసీకి వర్తించవా?.. కాంగ్రెస్ అంతర్గత పోరులో కొత్త లొల్లి!

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. "మాట ఒకటే.. సబ్జెక్ట్ ఒకటే.. కానీ ఒకరు మాట్లాడితే తప్పట, మరొకరు మాట్లాడితే ఒప్పా?" అంటూ హస్తం శ్రేణుల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేను గెలిపించాలని కోరితే కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధమంటూ హడావుడి చేసిన పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్.. ఇప్పుడు స్వయంగా తనే పోటీ చేస్తానని ముందస్తుగా ప్రకటించుకోవడం గాంధీభవన్‌లో సరికొత్త మంటలు రేపుతోంది.కొద్దిరోజుల క్రితం పరకాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్ర దుమారం రేపింది. "ఎన్నికలకు ముందే అభ్యర్థిని ప్రకటించే హక్కు సీఎంకు ఎక్కడిది? కాంగ్రెస్ పద్ధతి ఇది కాదు" అంటూ పెద్ద పంచాయితీ పెట్టారు. అది చిలికి చిలికి గాలివానలా మారి ఏకంగా మంత్రి వర్గం వరకు చర్చకు దారితీసింది.