తెలంగాణ

Telangana Congress: కాంగ్రెస్‌లో ‘మునుగోడు’ మంటలు.. హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా రాజగోపాల్ రెడ్డి!

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. గత కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ఈ సీనియర్ నేత, ఒక్కసారిగా సొంత పార్టీ సర్కార్‌పైనే అసంతృప్తి స్వరం వినిపించడం గాంధీభవన్‌ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు తరలిపోతున్నాయని, సాధారణ శాసనసభ్యులకు మొండిచేయి చూపిస్తున్నారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను రచ్చకెక్కించాయి. దీంతో హస్తం గూటిలో ఇప్పుడు ‘మునుగోడు’ మంటలు ఏ స్థాయికి చేరతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానమే అయినప్పుడు కొన్ని నియోజకవర్గాలకు నిధులు వరదలా పారడం, మరికొన్ని ఎడారిలా మిగిలిపోవడం ఏంటని రాజగోపాల్ రెడ్డి సూటిగా ప్రశ్నించడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. "అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి పైసలు అడుక్కోవాలా?" అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.