చిత్రం లేదు
తెలంగాణTCongress: ఓట్లకేమో బీసీలు.. సీట్లకేమో రెడ్లా? కాంగ్రెస్లో భగ్గుమన్న ఎమ్మెల్సీ లొల్లి!
TCongress: ఎన్నికల నామినేషన్ గడువు ముగిసే క్షణం దాకా జాబితాలు తేల్చని కాంగ్రెస్ శైలికి భిన్నంగా, ఏకంగా ఆరు నెలల ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసి అందరికీ షాక్ ఇచ్చింది పీసీసీ. అయితే ముందస్తు వ్యూహంతో పైచేయి సాధించాలనుకున్న కాంగ్రెస్ పెద్దల ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టిందని చెబుతున్నారు.రెండు నియోజకవర్గాల్లోనూ ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడంతో గాంధీభవన్లో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. "ఓట్లు దండుకోవడానికి వెనుకబడిన వర్గాలు కావాలి.. పదవులు కట్టబెట్టేసరికి మాత్రం రెడ్డి సామాజిక వర్గమే గుర్తొస్తుందా?" అంటూ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు.
