తెలంగాణ
Telangana Congress : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వేట.. ఆ 3 సీట్లు ఎవరికి?
తెలంగాణ కాంగ్రెస్లో పెద్దల సభ సీట్ల కోసం అంతర్గతంగా తీవ్ర ఉత్కంఠ మొదలైంది. శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండటంతో అధికార పార్టీ నేతలంతా ఈ మూడు ఖాళీలపై కన్నేశారు. ఎన్నికల ఖర్చు, ఓటింగ్ టెన్షన్లు లేకుండా సునాయాసంగా పెద్దల సభలోకి అడుగుపెట్టే అవకాశం ఉండటంతో ఆశావహులంతా గాంధీభవన్, అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, ఈసారి కేవలం పైరవీలకే కాకుండా పక్కా సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గట్టి పట్టుదలతో ఉండటం పార్టీలో సంచలనం రేపుతోంది.
