తెలంగాణ

congress: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ‘హస్తం’ గూటిలో గుబులు!

congress: సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ అంటే దూకుడు మామూలుగా ఉండదు. సర్కార్ చేసే చిన్న అభివృద్ధి పనైనా మైకులూది ఊరూవాడా ప్రచారం చేసుకోవాలి. బలం తక్కువగా ఉన్న ప్రాంతాలను వెతికి పట్టుకుని మరీ జెండా పాతాలి. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రానికే గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరంలో మాత్రం చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకెళ్తుంటే, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు మాత్రం నత్తనడకన సాగుతూ ఉనికిని కాపాడుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పరిపాలనా వికేంద్రీకరణ, వేగవంతమైన అభివృద్ధి పేరుతో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం, త్వరలోనే వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.