తెలంగాణ
ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా ఇంకా మోగలేదు.. నోటిఫికేషన్‌కు మరో నాలుగు నెలల సమయం ఉంది.. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.. ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల లాబీయింగ్‌తో హస్తం శిబిరంలో సందడి మొదలైంది. ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎవరిని అధిష్టానం పక్కన పెడుతుంది? అన్న చర్చలు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది.
