చిత్రం లేదు
తెలంగాణTelanganaCoalScam: తెలంగాణలో భారీ కుంభకోణం? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు!
తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమంగా బొగ్గు కొరతను సృష్టించి, తద్వారా విద్యుత్ కోతలకు దారితీసేలా చేసి ఒక భారీ విదేశీ బొగ్గు కొనుగోలు కుంభకోణానికి తెలంగాణ ప్రభుత్వం తెరలేపుతోందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయంగా నాణ్యమైన బొగ్గు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నప్పటికీ, కావాలని విదేశాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు కాంట్రాక్టర్లు ముడుపుల ఆశ చూపి ఇంధన శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తుండటంతోనే ఈ ప్రతిపాదనలు ముమ్మరమయ్యాయని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
