తెలంగాణ

సర్‌పై సీఎం అభ్యంతరం.. సీఈసీకి కీలక సూచనలు చేసిన రేవంత్ రెడ్డి!..

తెలంగాణలో SIR ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదని.. అనర్హులు జాబితాలో చేరకూడదని సీఈసీకి లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు. తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకేలా పరిగణించవద్దని సూచించారు. నోటీసులు అందుకున్న కూలీలు, వలస కార్మికులు, వృద్ధులకు మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని.. పట్టణాల్లో సహాయ కేంద్రాలు, వికేంద్రీకృత విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా SIR పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని సీఎం కోరారు.