తెలంగాణ

హైదరాబాద్‌ను కమ్మేసిన మేఘాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు!!..

భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ముసురుతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలైన కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మూసాపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్‌లలో తెల్లవారుజాము నుంచే వాన జోరుగా కురుస్తోంది. అటు ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌లతో పాటు.. లింగంపల్లి, చందానగర్, మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. ఉదయం నుంచే ఆకాశం పూర్తిగా మేఘావృతమై, చీకట్లు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడింది. ఈ హఠాత్తు వర్షంతో ఉదయాన్నే ఆఫీసులకు, పనులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.