తెలంగాణ

TG: తెలంగాణలో జనగణన 2027 షెడ్యూల్ ఇదే..

TG: తెలంగాణలో అధికారికంగా జనాభా లెక్కల సేకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ‘జనగణన-2027’ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు సమగ్ర షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో పునఃప్రచురించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఈ భారీ కసరత్తును పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని విభాగాల అధికారులను ఆదేశించింది.ఈసారి సాంకేతికతను జోడించి, ప్రజల భాగస్వామ్యంతో మూడు దశల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ జనగణన ప్రక్రియను ప్రభుత్వం మూడు దశల్లో పూర్తి చేయనుంది. ఇందులో భాగంగా ముందుగా 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు తమ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా కుటుంబ వివరాలను సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'స్వీయ గణన'కు అవకాశం కల్పించారు.