తెలంగాణ
Elnino: ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం
Elnino: సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్ నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సబ్-కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజుతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
