తెలంగాణ
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. నిరుద్యోగులకు శుభవార్త?
నేడు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉండనుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సమావేశం ప్రారంభం కానుండగా, అంతకంటే ముందు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంత్రులతో సీఎం అనధికారికంగా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఇదిలాఉండగా, కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై సీఎస్ సంజయ్ జాజు ముందస్తు కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. సచివాలయంలో ఉన్నతాధికారులతో నిన్న ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రధాన అజెండా ప్రతులు, చర్చించాల్సిన ముఖ్యాంశాలు, ప్రతిపాదిత బిల్లులను పరిశీలించారు. వాటిని కేబినెట్ సమావేశంలో చర్చించడానికి గల అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిసింది.
