తెలంగాణ

Telangana By-elections: తెలంగాణ సెమీ ఫైనల్స్.. బరి గీసిన రేవంత్ రెడ్డి!..

ఎల్ నినోతో వేడి ముందే పుట్టుకొచ్చినట్లు, తెలంగాణలో కావాలనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. యథావిధిగా జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్గి పుట్టించింది. ఒక సీట్ బీసీలకు, మరొక స్థానం ఓసీలకు అంటూ ప్రచారం జరిగినా, చివరికి నమ్మిన కాంగ్రెస్ కార్యకర్తలకే సీట్లు ఇచ్చింది. ఒకే పార్టీలో ఉండి కట్టుబడి పని చేసిన వారికి సీట్లు ఇస్తామనే సంకేతాలు ఇచ్చింది. అయితే బీసీ డిక్లరేషన్ పెట్టి అన్నింట్లో బీసీలకు వాటాలు పెంచుతామని చెప్పిన అధిష్టానం, ఇక్కడ రాజకీయంగా పోటీలో బీసీకి టికెట్ ఇవ్వడంలో వెనుకడుగు వేసిందనే విమర్శలు తావిస్తున్నాయి.