తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బిగ్ అటాక్.. సంచలన ఆరోపణలు చేసిన హరీశ్‌రావు!..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడు వెయ్యి రోజులు దాటినా హామీలకు అతీగతి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.