తెలంగాణ

Telangana Politics : తెలంగాణలో బీజేపీ దూకుడు వర్కౌట్ అవుతుందా?

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ పార్టీకి బలమైన రాజకీయ పునాది ఉన్న రాష్ట్రం తెలంగాణ. అందుకే ఎప్పటినుంచో ఇక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా కాషాయ దళం పావులు కదుపుతోంది. అయితే ఎన్నికల సమయంలో హడావుడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం అనే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ.. ఈసారి కమలనాథులు పూర్తి భిన్నమైన క్షేత్రస్థాయి వ్యూహంతో రంగంలోకి దిగారు. తాజాగా అధిష్టానం నియమించిన ఇన్‌ఛార్జ్‌లు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.