bjp : ఓసీ, బీసీ లెక్కలతో సరికొత్త ఎత్తుగడ.. బీజేపీ గెలుపు గుర్రాలు వీరేనా?
bjp : తెలంగాణలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పక్కా ప్లాన్‌తో బీజేపీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి కేడర్‌లో పూర్తిస్థాయిలో జోష్ నింపేందుకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా పరిగణిస్తూ అధిష్టానం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఒకవైపు ఓటర్ల నమోదు ప్రక్రియను పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు స్థానాల్లో ఒకచోట ఓసీ, మరోచోట బీసీ అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించాలనే వ్యూహంతో కమలనాథులు ముందుకెళ్తున్నారు.పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం.. సామాజిక సమీకరణాల లెక్కలతో ఇద్దరు కీలక నేతల పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారట. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఓసీ కోటాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
