తెలంగాణ

Telangana Politics: సొంత నేతకా? బయటి వ్యక్తికా? బీజేపీలో ముదిరిన టికెట్ వార్..

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాషాయ పార్టీలో ఆధిపత్య పోరుకు తెరలేపాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు స్థానాలకు పోలింగ్ జరగనుండగా, ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంపై బీజేపీ శ్రేణుల్లో ముందే స్పష్టత వచ్చింది. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. కానీ, ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానమే ఇప్పుడు పార్టీలో ముఠా తగాదాలు, తీవ్ర అసంతృప్తికి కేంద్ర బిందువుగా మారింది.