తెలంగాణ

Telangana: భాగ్యనగర్ సొసైటీ భూములకు రెక్కలు!!.. బౌండరీ వేసేందుకు క్లీన్ చేస్తున్న గ్రీన్ కో అండ్ టీం?

కూకట్ పల్లి సర్వే నెంబర్‌ 1007కు కొత్తగా రేకులు పాతి బౌండరీ ఫిక్స్ చేస్తున్నారు. ప్రైం ప్రాపర్టీకి చెందిన ఆస్తులు అగ్రిమెంట్ చేసుకున్న గ్రీన్ కో అండ్ టీం అంతా నడిపిస్తోంది. ఈ టీంలో కీ రోల్ పోషించిన పొనుగొంటి శ్రీనివాసరావుపై ఏడాది క్రితం 5 కేసులు నమోదు అయ్యాయి. నిత్యం సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ భూములపై ఏదో ఒక విచారణ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆసియాలోనే అత్యంత వివాదాస్పద భూములుగా వీటిని చెప్పవచ్చు. అలాగే అత్యంత విలువైన భూమిగా భావిస్తారు. 240 ఎకరాలు కాగా ఎకరం 300 కోట్లు అని చెప్పినా కళ్లు మూసుకుని కొనేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ప్రైవేట్ ఆస్తి కావడంతో ఎన్నో లిటిగేషన్స్ వచ్చి పడ్డాయి.