తెలంగాణ
Telangana: అన్నమో రామచంద్రా అనాల్సిందేనా?.. గంజి నీళ్లకైనా గతి ఉంటుందా?..
బియ్యం కేజీ వంద రూపాయలు మార్క్ దాటుతోంది. మార్కెట్లో ఇతర వస్తువుల ధరలు పెరిగినా బియ్యం విషయంలో ఆ దూకుడు ఎపుడూ కనిపించలేదు, ఇపుడు ఎల్ నినో పుణ్యామని హద్దులు దాటేస్తోంది. బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలను చూసి బడుగు జీవులు ఠారెత్తుతున్నారు. సాధారణ సన్న బియ్యం ధర చూస్తే గత నాలుగు నెలల క్రితం కిలో యాభై రూపాయల నుంచి 55 గా ఉంటే ఇపుడు అది ఏకంగా 85 రూపాయల దాకా ఎగబాకేసింది. ఇక తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలలో పండుగ సీజన్ నాటికి కొన్ని రకాల బియ్యం ధరలు కిలో ఏకంగా వంద రూపాయలు దాటే అవకాశం ఉందని మిల్లు యజమానులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బాస్మతి వంటి ప్రీమియం రకాల ధరలు ఇప్పటికే కిలో 130 నుండి 240 పైనే పలుకుతున్నాయి.
