తెలంగాణ

ఎస్ఐఆర్​ పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..

తెలంగాణలో జరుగుతున్న ఎస్ఐఆర్​ ప్రక్రియలో మరో 25 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 47 లక్షల మంది ఓటర్లకు మాత్రమే అందాయి. వీరిలో కేవలం 9 లక్షల మంది మాత్రమే అందుకున్న నోటీసులకు సమాధానం అందించారు. అయితే, కొన్ని చోట్ల నోటిసులకు సమాధానం ఇవ్వడానికి ఓటర్లు ముందుకు రావడంలేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఓటర్లు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 16న నోటీసుల ప్రక్రియ పూర్తికానుంది.