తెలంగాణ

తెలంగాణలో మరో స్కామ్.. వెలుగులోకి నకిలీ సదరం సర్టిఫికెట్ల భాగోతం!..

కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఘటన చర్చనీయాంశంగా మారింది. నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటా కింద 18 మంది ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు.. వీరు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన ఎంపిక పరీక్షలో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.. కాగా మెడికల్ బోర్డు వైద్య పరీక్షల్లో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.