తెలంగాణ
Telangana: అమిత్ షా టూర్‌తో తెలంగాణలో పొలిటికల్ హీట్!.. బీజేపీ–బీఆర్ఎస్ పొత్తు పొడిచిందా?!..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–బీఆర్ఎస్ మధ్య పొత్తు చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానుండటంతో.. ఈ పర్యటన చుట్టూ రాజకీయ వర్గాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అధికారికంగా ఇది ఒక కార్యక్రమం కోసం జరుగుతున్న పర్యటనే అయినప్పటికీ.. రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం అమిత్ షా హాజరుకానున్న కార్యక్రమం ప్రతిమ గ్రూప్‌కు సంబంధించినది. ఆ సంస్థ ఛైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు.. అయితే బోయినపల్లి కుటుంబానికి బీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్‌తో ఉన్న రాజకీయ సంబంధాలను ప్రస్తావిస్తూ.. ఈ పర్యటనను బీజేపీ–బీఆర్ఎస్ మధ్య భవిష్యత్ సమీకరణాలకు సంకేతంగా కొందరు రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.
