తెలంగాణ

TG: లంచగొండులకు సచివాలయం అండ... 22 కేసులు క్లోజ్?

తెలంగాణలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అవినీతి అధికారులను సచివాలయం వెనకేసుకొస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లలో ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరిన 22 కేసుల్లో ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే కాకుండా, ఆ కేసులను ఉపసంహరించుకోవాలని దర్యాప్తు సంస్థను ఆదేశించినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) లేఖ రాశారు.